జనం న్యూస్ జూన్ 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములో సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల (2,57,500=00) చెక్కులను 11 మంది లబ్ధిదారుల ఇంటి వద్దకువెళ్లి అందచేసిన కాంగ్రెస్ నాయకులు. ఇట్టి చెక్కులను ఆరోగ్య రీత్యా దవాఖానలో చికత్స చేపించుకున్నవారికి మంజూరు ఇప్పించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలోపే పార్టీలకు అతీతంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వారి ఇంటి నుండి అప్లికేషన్లు స్వీకరించి చెక్కులు మంజూరు అయినా తర్వాత వారి ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు అందచెయ్యడం జరుగుతుంది. ఏర్గట్ల టౌన్ కు సంబదించి ఇప్పటికీ 18 నెలలోనే 62 కుటుంబాలకు లబ్ధి చెక్కులను అందచేయటం జరిగింది. ఇంకా 50 వరకు అప్లికేషన్లు పెండింగ్ యున్నవి. అవి మంజూరు కావాల్సి యుంది. ప్రతి ఒక్కరికి ఆలస్యమైనా రావడం పక్కా జరుగుతుందని గ్రామములో ఎవరైనా సీఎం ఆర్ ఏఫ్ అప్లికేషన్ మాకు అందచేసిన తర్వాత మంజూరు చేపించే బాద్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమములో నిజామాబాద్ జిల్లా డెలిగేట్ డీసీసీ జీవన్ రెడ్డి, ముస్కు మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొ