జనం న్యూస్ జూన్ 7 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రకృతిని రక్షించే దిశగా అంకితభావంతో చేసిన కృషికి గుర్తింపుగా మా సంస్థ రాందేవ్ రావ్ ఆసుపత్రి కి ఈ సంవత్సరం యశోద హాస్పిటల్ మరియు హెల్ప్ ఆర్గనైజషన్ సంయుక్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మన ఆసుపత్రి కి హరిత పురస్కారం లభించిందని తెలియజేయడంలో మేము ఎంతో గర్విస్తున్నాము. కూకట్పల్లి లో రాందేవ్ ఆసుపత్రి ని కూకట్పల్లి ఊపిరితిత్తులు కూకట్పల్లి గా అభివర్ణించడం జరిగింది.ఈ పురస్కారం పచ్చదనం పరిరక్షణ గురించే కాకుండా సేఫ్ బయో మెడికల్ వాడకం, యస్ టి పి మరియు సోలార్ వాడకం గురించి కూడా పరిణలోకి తీసుకొని ఇవ్వడం జరిగింది.పర్యావరణ పరిరక్షణ, మొక్కల నాట్లు, ఆకుపచ్చ పరిసరాల ఏర్పాటులో మా సంస్థ చేసిన నిరంతర శ్రమకు ఈ పురస్కారం ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఈ గౌరవం మాకు లభించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ఈ విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా మరింత ఉత్సాహంగా పర్యావరణ హిత కార్యకలాపాలు కొనసాగిస్తామని, ఆసుపత్రి సీఈఓ డాక్టర్ యన్ యోబు తెలిపారు.రాందేవ్ రావ్ ఆసుపత్రి తరుపున ఈ అవార్డు ని సీఈఓ డాక్టర్ యన్ యోబు యోబు మరియు డాక్టర్ స్వాతి రెడ్డి స్వీకరించడం జరిగింది.