జనం న్యూస్ : 7 జూన్ శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్దిపేట మార్కండేయ దేవాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలో భాగంగా శనివారo రోజు మార్కండేయ దేవాలయం బైలాస్ లోని సభ్యులకు జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్, డాక్టర్ డి. ఎన్. స్వామి, కుమ్మరి కుంట రమేష్, ఎలక్షన్ అధికారి మామిడాల గౌరీమోహన్, జి. జగదీశ్వర్ పాల్గొన్నారు. కుమ్మరి కుంట రమేష్ బైలాస్ లో ఉన్న విషయాలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎలక్షన్ అధికారి గౌరీమోహన్ తో ఎన్నికల విధులు నిర్వహించిన సహాయ బృందాన్ని ఘనంగా సన్మానించారు. ఎలక్షన్ అధికారి గౌరీమోహన్ కు సహాయకులుగా ఎన్నికల విధులు నిర్వహించిన గడ్డం బాలకిషన్ విశ్రాంత గెజిటెడ్ప్రధానోపాధ్యాయులను నూతన కార్యవర్గ సభ్యుల సమక్షమున నూతన అధ్యక్షుడు కాముని రాజేశo ఘనంగా సన్మానించినారు. సన్మాన గ్రహీత గడ్డం బాలకిషన్ మాట్లాడుతూ పద్మశాలి అంటే పద్మము- తామరపువ్వు లేదా కమలము, శాలి- వస్త్రము (తులు భాషలో శాలి- సాలిపురుగు) కమలంలో ఇల్లు కలవాడు విష్ణునాబి కమలములో వెలసిన తంతువుల ద్వారా అమూల్య వస్త్రాలు నిర్మించే వారైనందున పద్మశాలి అనే పేరు వచ్చిందని, పద్మశాలి వంశం వేదయుగం నుండి ఉందని, వీరు ప్రపంచానికి వస్త్ర దానం చేసి సమాజానికి ఉపయోగ పడ్డార న్నారు, మొదటగా 2025-2027 సిద్దిపేట పద్మశాలి సమాజం నూతనంగా ఎన్నికైన కార్యవర్గంకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ఈ కార్యవర్గంలో కోశాధికారి - సూరం ప్రసాద్, కార్యవర్గ సభ్యుడు- ఆడెపు నాగరాజు (రిపోర్టర్) వీరిద్దర మల్టీ పర్పస్ హై స్కూల్లో తన శిష్యులు కావడం విశేషంగా భావించానని గడ్డం బాలకిషన్ తెలిపినారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు, గత కార్యవర్గ సభ్యులు, జిల్లా-రాష్ట్ర పద్మశాలి సంఘ నాయకులు, సమాజ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.