జనం న్యూస్ జూన్ 7 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ఆల్విన్ కాలనీ డివిజన్ తులసీనగర్ లో ఉన్న రేషన్ షాప్ ముందు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ డివిజన్ బిజెపి అద్యక్షులు ఎత్తరి రమేష్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్ రావు నరేందర్ రెడ్డి మరియు స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాదాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ రానున్న వర్షాకాల నేపథ్యంలో దేశంలో ఉన్న పేదలందరికీ మూడు నెలల ఉచిత బియ్యాన్ని ఒకేసారి ముందస్తుగా అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలుపుతున్నం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్న విషయాలు ప్రజలకు తెలవక రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందన్న భ్రమలో ఉంటున్నారని అందుకే ప్రతి రేషన్ షాప్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను పెట్టాలని అన్నారు. ఏలాంటి విపత్తు వచ్చినా కూడా ప్రజలు ఆకలితో ఉండకూడదన్న ఆలోచనతో మోడీ పేద ప్రజల కోసం ఆలోచన చేసి గొప్ప నిర్ణయం తీసుకుని పేదల పక్షపాతిగా నరేంద్ర మోడీ చరిత్రలో నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కమలాకర్ రెడ్డి, కుమార చారి, శ్రీనాథ్, కవిత, కమల్, శ్రీకాంత్, సుబ్బారావు, రాహుల్, రమేష్, సిరి తదితరులు పాల్గొన్నారు…