జనంన్యూస్. 07. నిజామాబాదు. రూరల్.నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి. జక్రాన్ పల్లి మండల కేంద్రంలో పలు కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల అకాల మరణాలతో విషాదంలో మునిగిన కుటుంబాలకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.జక్రాన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైడి మల్లేష్ కుమారుడు గంగారెడ్డి అకాల మరణం చెందడంతో, వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. అదే విధంగా, సీనియర్ జర్నలిస్ట్ బుయ్య గంగాధర్ కుమార్తె వెన్నెల మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అలాగే జక్రాన్ పల్లి తాండాకు చెందిన బాదావత్ గమ్య కుమారుడు బాణావత్ శ్రీను, కేశ్ పల్లి తాండాకు చెందిన బాదావత్ భీమా కుమారుడు బాదావత్ నవీన్ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన సందర్భంలో ఆయా కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే వెంట పీసీసీ డెలికేట్ శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్, జక్రాన్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి, సోషల్ మీడియా కోర్డినేటర్ వినోద్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.