జనం న్యూస్, జూన్ 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు శనివారం శ్రీ దుర్గామాతను దర్శించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ చంద్రకళ దంపతులు,మరియు చిన్నబోయిన కృష్ణ సావిత్రి దంపతులు అనంతరం మేకల కనకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని పాములపర్తి గ్రామంలో అతి సుందరంగా దుర్గామాత ఆలయాన్ని నిర్వహించి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందని ఇంత మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని దుర్గామాత విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.