జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి లో కొలువైన శ్రీ మారమ్మ తల్లి ఆలయంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారమ్మ జాతర మహోత్సవంలో భాగంగా శనివారం ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ ప్రారంభించారు. ప్రత్యేక పూజలు అనంతరం ఈ అన్న మహా ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ జాతర మొత్వాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అన్నారు. ఇంత పెద్ద ఎత్తున భక్తులకు అన్నదానం చేయడం అభినంద నీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు దుర్గారెడ్డి ధనుంజయ నాయుడు గోపాల్ అరిగే హరిబాబు అనిల్,శివ,సురేంద్ర,నారాయణ, మహేష్ పవన్ కుమార్ దండు నాగేశ్వరరావు సుబ్బ నరసయ్య వెంకటేష్ బాబు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.