జనం న్యూస్ జనవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప పోరాటయోధుడు ఆజాద్ హింద్ పౌజు వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గురువారం మూసాపేటలోని ఆయన విగ్రహానికి వేసి రమేష్ స్థానిక నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. భరతమాత ముద్దుబిడ్డ సుభాష్ చంద్ర బోస్ అని ఆయన చేసిన త్యాగం దేశ చరిత్రలో చెరిగిపోనిదన్నారు.