జుక్కల్ జూన్ 9 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు బస్వాపూర్ కల్లాలి మధ్య రోడ్డు మీద పడిన చెట్లను మరియు జుక్కల్ ఆర్టీసీ బస్టాండ్ ముందు చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్ ఇబ్బంది కావడం వల్ల ఎస్సై భువనేశ్వర్ చెట్లను తీసివేసి రోడ్ క్లియర్ చేయడం జరిగింది . ఎస్సై భువనేశ్వర్ చొరవతో రోడ్డుపైన పడ్డ చెట్లను తీసివేయడంతో పలువురు ఎస్ఐని, అభినందించారు.