జనం న్యూస్ జనవరి 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్వహించబోయే వేడుకలకు ముస్తాబు అవుతున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఐఏఎస్, ఎస్పీ డివి శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పి, ఇతర శాఖల అధికారులు వివిధ ఏర్పాట్లను పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చే అధికారులకు మరియు సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
ఎస్పీ మాట్లాడుతూ….
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా వేడుకలకు వచ్చే అధికారులకు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ కమాండర్ గా ఆర్.ఐ పెద్దన్న వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డేవిడ్, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు గ, ఆసిఫాబాద్ ఎ.ఎస్.పి చిత్తరంజన్ , ఆర్డీవో లోకేశ్వరరావు, ఆర్.ఐ లు పెద్దన్న, అంజన్న, ఇన్స్పెక్టర్ రవీందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.