ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్
జనం న్యూస్ జూన్ 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
నూతనంగా అమలుపరుస్తున్న పోల్ టాక్స్ విధానాన్ని రద్దు చేయాలని ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ , టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరోజ్ గార్డెన్ లో జిల్లాలోని కేబుల్ ఆపరేటర్ యూనియన్ సమావేశంలో హాజరై వారు మాట్లాడాతూ నూతన పోల్స్ టాక్స్ విధానంతో కేబుల్ ఆపరేటర్లకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. కార్పొరేట్ వ్యవస్థలో కేబుల్ ఆపరేటర్లు కొట్టుమిట్టాడుతూ జీవనం కొనసాగిస్తున్నారని నూతన పాలసీల ద్వారా వారు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని అభిప్రాయపడ్డారు. కేబుల్ ఆపరేటర్లకు కేబుల్ వైర్ సవరణ కొరకు సమయం ఇవ్వాలని, కేబుల్ ఆపరేటర్లకు క్యాటగిరి 1 క్రింద గుర్తించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేబుల్ ఆపరేటర్లకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించి కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై త్వరలో కార్యాచరణ రూపొందించి ఉద్యమించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం లో అల్లూరి లోకేష్ , అబ్దుల్ రహమాన్ , సాజిద్ , జుంగోని అశోక్ గౌడ్ ,అబ్దుల్ వహీద్ ఖాన్, దిలీప్ , కిరణ్ , స్వప్న , సంపత్ , జమీల్ , సాయి కృష్ణ , నగేష్ లను ఎన్నుకున్నారు.