జనంన్యూస్. 10.నిజామాబాదు.
నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని తేది :9-6-2025 నాడు రాత్రి విసిన భారీ ఈదురు గాలులకు ఎన్నో భారీ చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతో ప్రయాణికులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరియు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని, జేసీబీ ల సహాయం తో చెట్లను తొలగించాలని సంబంధిత సిబ్బందికి నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS., తెలియజేశారు.
ఈ సందర్భంగా పలు ప్రాంతాలలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు స్వయంగా పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఇలాంటి ఆపత్కాల పరిస్థితులలో ప్రజలు వెంటనే పోలీస్ లకు సమాచారం అందిస్తే అవసరం అయిన సహాయం అందిస్తాము అని , ప్రజల భద్రత సౌకర్యం కోసం పోలీసులు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.