జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, యువత చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తద్వారా మన గ్రామానికి, జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు వాటి అంతట అవే వస్తాయని ఆ దిశగా స్థానిక కోచ్ ల ద్వారాసాధన చేసి మంచి ఫలితాలు సాధించాలని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కుర్రా మణి యాదవ్ తెలిపారు.వాకర్స్ క్లబ్ కార్యదర్శి ఉప్పు శెట్టి సుధీర్ మాట్లాడుతూ గతంలో నందలూరు అంటేనే క్రీడలకు ప్రసిద్ధిగాంచి మంచి క్రీడా కారులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారని వహించారని ఇప్పటి యువత క్రీడా మైదానం వైపు చూడకుండా మొబైల్ ఫోన్ లకు వ్యసనంగా మారి శారీరక శ్రమ లేకుండా ఓబే సిటీకి గురికావడం చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్ సబ్ సెంటర్ నందు కుర్రా మణి యాదవ్ బావమరిది కుమారుడు భారతాల సాత్విక్ చిన్న వయసులోనే బౌలింగ్ యందు అత్యుత్తమ ప్రతిభను కనపరుస్తున్నందుకు భవిష్యత్తులో ఈ అబ్బాయి క్రీడలలో రాణించి మంచి స్థాయికి రావాలని ఆకాంక్షిస్తూ భారతాల సాత్విక్ ను క్లబ్ సభ్యులు, క్రికెట్ సబ్ సెంటర్ కోర్సులు మరియు విద్యార్థుల మధ్య ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కుర్రామణి యాదవ్, ఉప్పుశెట్టి సుధీర్, మోడపోతుల రాము,గురు ప్రసాద్, క్రికెట్ సబ్ సెంటర్ కోచ్ ఫిరోజ్ ఖాన్, దివ్యాంగుల క్రికెట్ ప్రతినిధి శివకోటి, జంగం శెట్టి హరి, గుండు సురేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.