జనం న్యూస్ 10జూన్ పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి అధ్యక్షతన బిజెపి మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు కన్నం అంజయ్య మాట్లాడుతూ 11 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోయాయని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారతదేశం నాలుగవ స్థానానికి చేరుకుందని రానున్న రోజుల్లో అమెరికా జర్మనీ తర్వాత అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని అన్నారు. 11 ఏళ్ల పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తీసుకువచ్చిన అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటింటికి ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు కృషిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. బిజెపి రాష్ట్ర శాఖ సూచన మేరకు జూన్ 5 నుండి ఆగస్టు 15 వరకు ప్రతి బూతులో కనీసం 11 మొక్కలు నాటి వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా సమావేశ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆత్మనిర్బర్ లో భాగంగా మేక్ ఇండియా,మేడ్ ఇండియా,స్కిల్ ఇండియా లాంటి పథకాల ద్వారా భారతదేశం సొంత పరిజ్ఞానంతో ఆపరేషన్ సింధూర్ లో ప్రయోగించబడిన బ్రహ్మోస్ మిస్సైల్స్ ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేశాయని అన్నారు.ఇట్టి సమావేశంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ సీనియర్ నాయకులు గంగుల కొమురెల్లి, సంకిటి రవీందర్ రెడ్డి, కోట మల్లేశం,కొత్తూరు బాబు, తోడేటి గట్టయ్య, గంగాధర శ్రీనివాస్,మంద భీమయ్య, వరద రాము, కాశెట్టి రాజు, తడగొండ శ్రీనివాస్,పూసాలా సునీల్, కన్నం పవన్, చేపూరి సురేష్ నరుకుల శ్రీధర్,కూన కుమార్,మారుకొండ రాజయ్య, క్యాస నవీన్,అయిలవేణి అనిల్,మ్యాక భాస్కర్ రెడ్డి,పెద్ది భీరయ్య, తిరుపతి నాయక్,పూసాల మహేష్ గన్నవేని శేఖర్ తదితరులు పాల్గొన్నారు..