వైసీపీ స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జూన్ 10 (జనం న్యూస్):
పొగాకు రైతుకు అండగా ఈనెల 11న పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వస్తున్నా వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోరుబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఒక్క రైతు కూడా తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని, ముఖ్యంగా పొగాకు, మిర్చి,కంది, వరి ఇలా ఏ ఒక్క రైతూ ఆనందంగా లేడన్నారు. పొగాకు రైతు పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.. వైసీపీ ప్రభుత్వంలో పొగాకు కేజీ ధర రూ.360 వరకూ ధర వస్తే నేడు రూ.200 నుంచి రూ. 280 మాత్రమే ఉందన్నారు..పొగాకు రైతు మేలు కోసం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయించి మంచి ధరలు ఇప్పించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి దేనన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పొగాకు, మిరపకాయలు తమకు సంబంధం లేదనే విధంగా తప్పుకుంటున్నారాని ఆయన విమర్శలు చేశారు, ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.