జనం న్యూస్ జూన్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన శ్రీవాణి విద్య సంస్థ పదవ తరగతి ఫలితాలలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పబ్లిక్ పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన చిన్నారులకు అందిస్తున్న" షైనింగ్ స్టార్ "( ప్రతిభా పురస్కారం ) బహుమతిని కూడా పొందటం జరిగిందని " శ్రీవాణి " విద్యాసంస్థల అధినేత తాతపూడి సుబ్బారావు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థిని కొప్పిశెట్టి హర్షితా భాగ్య కోనసీమ జిల్లాకలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, డీఈవో సలీం భాషా, పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తదితరుల చేతుల మీదుగా 20వేల నగదు, ప్రశంసా పత్రం, పతకం అందుకున్నట్లు ఆయన తెలియజేశారు. పురస్కారాన్ని అందుకున్న చిన్నారిని వైస్ ప్రిన్సిపాల్ టి.సత్యవతి దేవి, పి. వ్యాసమూర్తి శర్మ (తంబి ), కే. ప్రసాద్, ఎస్. కృష్ణ, శిరీష, గౌరీ తదితర ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థినీ విద్యార్థులు అభినందించారు.