జనం న్యూస్ తరుపాడు మండలం జనవరి23:- నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకుని తర్లుపాడు మండలం యం పి పి యస్ లక్ష్మక్కపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రాతపై శిక్షణ ఇప్పించడం జరిగింది. విద్యార్థుల తలరాత మారాలి అంటే వాళ్ళ రాత బాగుండాలి అని గుర్తించి, విద్యార్థులకు రాత యొక్క ప్రాముఖ్యత ని వివరించారు.ప్రధానోపాధ్యాయులు కశ్శెట్టి జగన్ తన సొంత నిధులతో 50 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్సిల్స్ అందజేశారు. 3 రోజులు హ్యాండ్రైటింగ్ లో శిక్షణ ఇచ్చిన సి హెచ్ తిరుపాలయ్య, అడ్వకేట్ కి 3000/- రూపాయలు ఇవ్వడం జరిగింది.నిరంతరం విద్యార్థుల అభ్యున్నతి కి కృషి చేస్తూ , తన సొంత ఖర్చు చేస్తున్న జగన్ ని విద్యార్థుల తల్లిదండ్రులు , అలాగే గ్రామస్థులు అభినందించారు.