జనం న్యూస్. తర్లుపాడు మండలం జనవరి 23 మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మార్కాపురం ఎల్వి ప్రసాద్ కంటి వైద్య నిపుణులు త ర్లుపాడులో ఉచిత కంటి వైద్యం నిర్వహించారు స్థానిక వేణుగోపాల స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో ఈ వైద్య శిబిరం నిర్వహించారు వైద్య మండల సబ్ ఇన్స్పెక్టర్ బి బ్రహ్మనాయుడు ప్రారంభించారు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవాజి విజయభాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ వైద్య శిబిరంలో 100 మంది రోగులు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు అందులో 20 మందికి సత్తశిక్షల అవసరమని గుర్తించి మార్కాపురం ఎల్వి ప్రసాద్ వైద్యశాలకు వారిని తరలించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ముఖ్య సలహాదారు పోలేపల్లి జనార్దన్ రావు ప్రధాన కార్యదర్శి రవికుమార్ కోశాధికారి చిన్నమనగండ సుబ్రహ్మణ్యం నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నేరెళ్ల కార్తీక్ దొ గిపర్తి మల్లికార్జునరావు సత్యసాయి భజన మండలి కన్వీనర్ భవనం రామకృష్ణారెడ్డి మార్కాపురం ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సిబ్బంది విజన్ టెక్నీషియన్స్ ఆర్యవైశ్య ప్రముఖులు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు