జనం న్యూస్ జూన్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
15 - 6 -2025 న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం పాలకొల్లు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో అంతర్భాగంగా జరిగిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలిగా పాలకొల్లు సమీపంలోని భీమలాపురం గ్రామ వాస్తవ్యురాలైన " శ్రీ కొత్త కనక రత్నమాల " కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల జల వనరుల శాఖామాత్యులైన శ్రీ నిమ్మల రామానాయుడు స్వహస్తాలతో మరియు విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారైన శ్రీ డూండీ రాకేష్ మరియు ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పాలకొల్లు మాజీ శాసన సభ్యురాలు గారైన శ్రీ బంగారు ఉషారాణి సమక్షంలో నియామక పత్రాన్ని అందజేయడం జరిగినది … ఆ తదనంతరం పాలకొల్లు వాసవి ఆర్యవైశ్య సంఘం సూచన మేరకు మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు నన్ను అనగా మీ గుడివాడ వేణుగోపాల్ ను మరియు రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన కొత్త కనక రత్నమాల నీ సత్కరించినారు … ఆ తదుపరి గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు ని , ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డూండీ రాకేష్ ని మన పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి ఇరువురిని సత్కరించడం జరిగినది … ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి నుదురుపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు …!