▪ప్రజా పాలనలో భాగంగా ప్రజల వద్దకే అధికారులతో గ్రామ సభలు..
జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామ సభలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు..
జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్..
గ్రామ సభలలో లబ్ధిదారులను ఉద్దేశించి నాగరాజు మాట్లాడుతూ ;
ప్రతిపక్ష నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిజమైన లబ్ధిదారుల ఎంపిక మరియు పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ, గ్రామసభల ద్వారా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందనీ ప్రజలకు తెలియజేశారు.బి ఆర్ yes పది సంవత్సరాలలో జరగని అభివృద్ధి! తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ సంక్షేమ ప్రజా పాలనలో, వచ్చిన సంవత్సరంలోనే అనేకమైన ప్రజారంజక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అర్హులైన కుటుంబాలకు ప్రతి పేద ఇంటికి సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రజా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వకుండా నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం కాలం వెల్లదీసిందని అనేక రకాల ఇబ్బందులకు గురిచేసిందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికి రేషన్ కార్డులతో పాటు లబ్ధిదారులకు ప్రతి పథకాన్ని అందజేయడానికి, పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుంది అని అన్నారు. బి ఆర్ ఎస్ , బీజేపీ నాయకుల మాయ మాటలు నమ్మి అధైర్యపడవద్దని పర్లపల్లి నాగరాజు ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి ఉమ్మడి సందీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల ప్రశాంత్, నాగండ్ల నరేష్, గుర్రపు సంపత్ రెడ్డి, పర్లపల్లి విజయ్, కావటి తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.