జనం న్యూస్ జనవరి 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా చింతలమనేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు కళాబృందం ద్వారా విద్యార్థులకు రోడ్డు సేఫ్టీపై, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు
జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీ ప్రభాకర్ రావ్ పర్యవేక్షణ లో ప్రత్యేక షెడ్యూల్ లో భాగంగా గురువారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సి. ఐ రమేష్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని, తొందరపాటుతనంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. తమ తల్లిదండ్రులు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ రోడ్ సేఫ్టీ పాటించేలా చూడాల్సిన బాధ్యత ఉందని, అతి వేగంతో, అజాగ్రత్తగా వాహనాలు నడపడంతో నడిపే వారితోపాటు ఎదుటి వారు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని తల్లితండ్రులకు తెలపాలని సిఐ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. విద్యార్ధి దశ నుండే ట్రాఫిక్ రూల్స్ పై, రోడ్ సేఫ్టీ లపై అవగాహనా ఉండాలని, తల్లితండ్రులకు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, వాహనాలకు సంబంధిత పత్రాలన్నీ ఉంచుకోవాలని సూచించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌటాల సి. ఐ రమేష్ కళ బృందం సభ్యులు రాంచందర్, రోహిత్,చంద్రశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.