జనంన్యూస్. 17. సిరికొండ. ప్రతినిధి.
ఈరోజు ధర్పల్లి సీఐ ఆధ్వర్యంలో సిరికొండ పోలీస్ స్టేషన్ ఎస్సై రాము తన సిబ్బంది కలిసి, సిరికొండ మండల పరిధిలో సుమారుగా 100 మంది యువత గ్రామ సభ్యులతో కలిసి. 3 కిలోమీటర్ల మేర మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, పోలీసులు యువత మరియు గ్రామస్తులకు పలు సూచనలు చేశారు: ప్రతిరోజూ వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో భాగంగా, యువతకు రాగి మాల్ట్‌ను స్టీల్ గ్లాసులలో పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని కూడా సూచించారు. ఈ కార్యక్రమం యువతలో అవగాహన పెంపొందించేందుకు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.