జనం న్యూస్ జూన్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో మండల బీజేపీ అధ్యక్షులు కుడుపూడి చంద్రశేఖర్ అద్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మానేపల్లి అయ్యాజీ వేమా, పి.గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ చీకురుమల్లి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గణిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా చీకురుమెల్లి వెంకటేశ్వరరావు అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వేమా మాట్లాడుతూ ప్రధాని మోడీ భారత దేశానికి చేసిన అనేక సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను అంతం చేశారని అన్నారు. పేదల అభివృద్ధికి అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దేశంలో నాలుగు కోట్లకు పైగా ఇల్లు నిర్మించారన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా దేశంలో 51 కోట్లకు పైగా రాష్ట్రంలో 3.1 కోట్లకు పైగా ప్రజలు భీమా సౌకర్యం పొందారని తెలిపారు. గనిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలక అభివృద్ధికి నరేంద్ర మోడీ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. నారీ శక్తివంతం అభియాన్ ద్వారా పార్లమెంట్ మరియు అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు అని తెలిపారు. ప్రకృతి సెలవులు 12 వారాలు నుండి 26 వారాలకు పెంచారు అన్నారు. ఈ కార్యక్రమం లో వికసిత్ భారత్ మండల ఇన్చార్జి చీకరుమెల్లి శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యనమదల రాజలక్ష్మి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వేటుకూరి శ్రీనివాసరాజు, సోషల్ మీడియా నాయకులు యనమదల వెంకటరమణ, సాద్విక్, గ్రామస్తులు, మహిళలు, మహిళా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.