జనం న్యూస్ జూన్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్ కే దక్కుతుందని మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రప్రదంగా ఉపాధ్యాయుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నామని అటు తల్లుల ఖాతాలో తల్లికి వందనం తో పాటు ప్రతి చర్య పారదర్శకంగా కూటమి ప్రభుత్వం అమలు పరిచిందని ఘనత లోకేష్ కే దక్కుతుందని నాగ జగదీష్ అన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సుమారు 2200 మందికి స్థానచలనం కలిగిందని, ఇందులో గ్రేట్ టు హెచ్ఎంలు, డ్రిల్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు వెరసి మొత్తం 2200 మందికి బదిలీలు జరిగాయని నాగ జగదీష్ అన్నారు. రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి బుద్ధ కాశీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి కాండ్రేగుల సత్యనారాయణ ఇరువురు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ నాడు బదిలీల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయని చాలామంది నష్టపోయారని, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ సిఫార్సు లేఖలు ప్రామాణికంగా తీసుకుని అవినీతికి పాల్పడి బదిలీలు చేసి ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని కాశీ సత్యనారాయణ అన్నారు. టీచర్లు బదిలీల్లో ఇంగ్లీష్ టీచర్లు 272 మంది మ్యాథమెటిక్స్ టీచర్స్ 270, ఫిజిక్స్ టీచర్స్ 200, సోషల్ టీచర్స్ 220, తెలుగు టీచర్స్ 170, హిందీ టీచర్స్ 170, ఎన్ఎస్ టీటర్లు 170 మంది బదిలీలు అయ్యారని, అన్యాయంగా బదిలీ అయ్యి మన్యానికి పంపించిన టీచర్లను మైదానానికి తీసుకువచ్చిన ఘనత లో విద్యాశాఖ మంత్రి లోకేష్ కే దక్కుతుందని కాశీ సత్యనారాయణ అన్నారు.//