జనం న్యూస్ -జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలు రెండు రోజులపాటు జరగనున్నాయి, ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, గౌరవ అతిథులుగా నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ, నాట్కో ఫార్మా వైస్ చైర్మన్ పటేల్ చంద్రశేఖర్ రెడ్డి, నాట్కో ఫార్మా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పావూరి రంజిత్, కళాశాల ప్రిన్సిపల్ ఏ ఐలయ్య, ఫిజికల్ డైరెక్టర్ వెంకటకృష్ణారావు మరియు కళాశాల సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.