మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్ల పై చట్ట రిత్య కఠిన చర్యలు
విధ్యాసంస్థల యాజమాన్యాలు డ్రైవర్లకు డ్రంక్ అండ్ టెస్ట్ చేసిన తరువాతనే విధులలోనికి అనుమతించాలి: జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్
జనం న్యూస్ జూన్ 17
సంగారెడ్డి జిల్లా మంగళవారం ఉదయం పటాన్ చేరు పరిధిలో స్కూల్స్, కళాశాలలకు వెల్లుతున్న బస్ డ్రైవర్లకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించడం జరిగిందని జిల్లాఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి స్కూల్, కళాశాల యాజమాన్యాలు తమ బస్సు డ్రైవర్లను విధులలోనికి అనుమతించే ముందు తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన తరువాతనే విధులలోనికి అనుమతించాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుపడితే డ్రైవర్ తో పాటు విధ్యాసంస్థల యాజమాన్యాలపై చట్ట రిత్య కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.