జనం న్యూస్ జూన్ 17 ముమ్మిడివరం ప్రతినిధి
11,,సం కేంద్ర ప్రభుత్వ సుపరిపాలన వికసిత భారత్ సంకల్ప సభ తాళ్ళరేవు మండలం తాళ్ళరేవు లో మండల అధ్యక్షులు నిమ్మకాయల ఈశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వాహకులు భారత్ పర్యావరణ జిల్లా కూకన్వీనర్ చెక్క అజయ్ వర్మ మండల కో కన్వీనర్ ఎనమండ్ర విజయ్ కుమార్ పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నిర్వహించుకోవడం జరిగింది… ఈ కార్యక్రమానికి వ్యక్త గా విచ్చేసిన వికసిత భారత్ జిల్లా కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉచిత బియ్యాన్ని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇళ్ల నిర్మాణం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పీఎం సన్నిధి యోజన ద్వారా యువతకి ఉపాధి అనేక పథకాలను లబ్ధిదారులకు తెలియజేశారు.. ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ మరో వక్త అయిన ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం నుండి అమలు జరిగే ప్రతి పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకుని 2047 నాటికి దేశాన్ని ప్రపంచ దేశాల్లో సంపన్న దేశంగా ఎదగడానికి మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరూ వినియోగించుకోవాలని ఈ ప్రయత్నానికి తమ వంతు కృషి చేయాలని కోరారు… ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొలకోటి వెంకటరెడ్డి… జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ… మండల కన్వీనర్ దత్తాత్రేయ వర్మ… జిల్లా కో కన్వీనర్ రాజ్యలక్ష్మి జిల్లా కార్యదర్శి మరియమ్మ కో కన్వీనర్ కరిమల స్వామి కర్రి రాము.. దుర్గ ప్రసాద్,,, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు…