జనం న్యూస్ చంటి జూన్ 17
ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో ఎమ్మార్వో చంద్రశేఖర్ రావు ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై పరిష్కారానికి భూభారతి సదస్సులను రైతులు సదునియోగం చేసుకోవచ్చని తాసిల్దార్ చంద్రశేఖర్ అన్నారు. భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన అన్నారు. ఏదైనా సమస్య ఉంటే గ్రామ రెవెన్యూ సంస్థల్లో అధికారులకు సమస్య తెలిపి దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు. రైతు సదస్సులో దరఖాస్తులను తరగతి విచారణ చేసి అనంతరం ఆన్లైన్లో పొందు పరచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రభాకర్. సీనియర్అసిస్టెంట్ రాజేశ్వర్. శ్రావణ్. సౌజన్య. ధరణి ఆపరేటర్ వెంకట్ రాజిరెడ్డి . సర్వేయర్ రమేష్ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు