జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 17 రిపోర్టర్ సలికినీడి నాగు
ఇటు సంక్షేమం అటు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందని మున్సిపల్ చైర్మన్ రఫాని అన్నారు. పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయంలో తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయినందున సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు.చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలో 9827మందికి 13000 చొప్పున 12,77 5100రూపాయలు తల్లుల ఖాతాలలో జమ అయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు బేరింగ్ మౌలాలి, షేక్ నసీమా బేగం,కనమర్ల పూడి తిరుమల, జంగ సుజాత కునాల ప్రమీల,రాయని హరిత సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.