మత్స్య సంపద మృతికి కారణమైన ఫార్మా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్
జనం న్యూస్,జూన్17,అచ్యుతాపురం:వర్షం పడితే చాలు
పూడిమడక ఉప్పుటేరులో చేపలు చనిపోయినట్లే.. అలా ఎందుకు జరుగుతుందని ఆశ్చర్యపోతున్నారా..
అచ్యుతాపురం సెజ్ లో ఉన్న ఫార్మా కంపెనీల వ్యర్థ రసాయనాలను సముద్రంలోకి విడిచిపెట్టడంతో పూడిమడక ఉప్పుటేరులో లక్షలాది చేపలు మృత్యువాత పడుతున్నాయని,తీరం వెంబడి మృతి చెందిన లక్షలాది చేపలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయని,తరచూ చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.వేలాది మంది మత్స్యకారులు ఉప్పుటేరుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, మత్స్య సంపద మృతికి కారణమైన ఫార్మా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఏపీఐఐసీ అధికారులకు పలు మార్లు విన్నవించుకున్నా ఫలితం శూన్యమని మత్స్యకారులు తెలిపారు.చేపలు చనిపోయిన ఉప్పుటేరు ప్రాంతాన్ని పరిశీలించిన పొల్యూషన్ బోర్డ్ ఏఈ కి మత్స్యకార నాయకులు ఉమ్మిడి జగన్ సమస్యను వివరించారు.ఈ కార్యక్రమంలో దూడ మసేను,శ్రీను,మల్లికార్జున, పోలయ్య,జగదీష్,కాసుబాబు తదితరులు పాల్గొన్నారు.