జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 17 రిపోర్టర్ సలికినీడి నాగు
చనిపోవడం సమస్యలకు పరిష్కారం కాదని రైతులు గ్రహించాలి.
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది.
రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపింది జగన్ కాదా
ఐదేళ్లపాటు అన్నదాతల్ని, వ్యవసాయాన్ని గాలికి వదిలేసి, ఇప్పుడు ప్రజల ప్రభుత్వంపై విమర్శలు చేయడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం : మాజీమంత్రి ప్రత్తిపాటి.
“ నాదెండ్ల, తూబాడు గ్రామాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర బాధాకరం. నాదెండ్ల గ్రామానికి చెందిన నాశం ఆదినారాయణ, తూబాడు వాసి శిరిబోయిన గోపాల్ రావులు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వార్తవిని ఆవేదనకు గురయ్యాను. నిజంగా వారి మరణవార్త తీవ్రంగా కలచివేసింది. ప్రభుత్వ ఆదేశాలతో అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లలో ఉన్నందున, మృతుల గ్రామాలకు వెళ్లి వారి కుటుంబసభ్యులతో మాట్లాడాలని స్థానిక నాయకుల్ని ఆదేశించాను. వారి కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పాను. మరణించిన వారి కుటుంబాలకు చంద్రన్నబీమా వారంరోజుల్లో చంద్రన్నబీమా ఆర్థిక సాయం అందచేయాలని అధికారుల్ని ఆదేశించాను. ప్రభుత్వం తరుపున మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే టీడీపీనేతలు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మదన్ మోహన్, కామినేని సాయిబాబు, వేములపల్లి బసవయ్య, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, నెల్లూరి వెంకయ్య, శరత్, మొగిలి నాగలక్ష్మి తదితరులు రైతు కుటుంబాలను పరామర్శించి, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని రైతులు గ్రహించాలి అప్పులబాధ, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడితే సమస్యలు పరిష్కారం కావని రైతులకు సూచిస్తున్నాను. కొండంత కష్టం వచ్చినా గుండెధైర్యంతో ఎదుర్కోవడం రైతులకు తెలిసిందే. వారు నిత్యం ఎన్నో సమస్యలు… సవాళ్లు అధిగమిస్తూనే దేశానికి, రాష్ట్రానికి తమ వంతు సహాయసహాకారాలు అందివ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాంటి రైతులు తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడి, తమ కుటుంబాలను రోడ్డునపడేయవద్దని కోరుతున్నాను.చంద్రబాబు నిరసన తెలిపేవరకు జగన్ రైతులకు బీమాసొమ్ము ఇవ్వలేదు రైతాంగ సమస్యలు.. వ్యవసాయ వెతలపై గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నాడు ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు అసెంబ్లీలో నిరసన తెలిసేవరకు జగన్ రెడ్డి రైతులకు పంటలబీమా సొమ్ముకూడా విడుదలచేయలేదు. పోలవరం సహా ప్రధాన ప్రాజెక్టుల్ని జగన్ గాలికి వదిలేశాడు. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు కూడా పట్టించుకోకుండా అమాయకుల చావులకు కారకుడయ్యాడు. అలాంటి రైతు వ్యతిరేక గుడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు ఐడేళ్లు నిర్విరామంగా పోరాడారు. కూటమిప్రభుత్వం ఏడాదిలో రైతులకు ఎంతో మేలుచేసింది. ధాన్యం కొనుగోళ్లు జరిపి, సకాలంలో రైతులకు డబ్బులు అందించింది. జగన్ రైతులకు తలనొప్పిగా మార్చిన భూరక్ష-భూహక్కు పథకాన్ని పక్కనపెట్టింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి, రైతుల భూముల్ని కాపాడింది. పోలవరం నిర్మాణంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. వచ్చేనెలలో అన్నదాతా సుఖీభవ అమలుచేయనుంది. కల్తీ విత్తనాలు, ఎరువుల కట్టడికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఇవేవీ జగన్ కు, వైసీపీనేతలకు కనిపించవు. వారికి కావాల్సింది ప్రజల మధ్య విద్వేషాలు రేపి, రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడమే. అందుకోసమే ప్రతి అంశాన్ని రాజకీయం చేసి, తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు” అని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు నాదెండ్ల మండలం అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువ్వాజి మదన్ మోహన్ ఎడ్లపాడు మండలం అధ్యక్షులు కామినేని సాయిబాబు వేములపల్లి బసవయ్య వేములపల్లి వెంకటేశ్వర్లు యనమదల సూర్యనారాయణ పలువురు గ్రామ నాయకులు, మండల నాయకులు విచ్చేశారు.