జనం న్యూస్ జూన్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు మంగళవారం ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ తో కలిసి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ పరిశీలించారు .ఈ సందర్భంగా సి.ఎం రమేష్ పనుల ప్రగతిని స్వయంగా జిఎంఆర్ యాజమాన్యం వారిని అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. 2026 జూన్ నాటికి మొదటి దశ పనులు పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్ మరియు టిడిపి రాష్ట్ర నాయకులు దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.//