జనం న్యూస్ 18 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గ్రామీణాభివృద్ధి జరగాలంటే ఉపాధిహామీ పథకంలో పనిచేసిన ప్రతి పనికి వెంటనే నిధులు విడుదల చేయాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రాసిన లేఖను విజయనగరంలో మంగళవారం విడుదల చేశారు. గ్రామీణ అభివృద్ధికి చేపట్టిన అనేక పనులకు సంబంధించి గడిచిన 6 నెలలుగా బిల్లులు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు బిల్లు మంజూరు చేయాలని కోరారు.