జనం న్యూస్ జూన్ 18 ముమ్మిడివరం ప్రతినిధి
ఏపిలో ప్రసిద్దిగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు దేశవిదేశాలనుండి,ఇతర రాష్ట్రాలనుండి లక్షలాదిమంది భక్తులు వచ్చి వారి కోరినకోర్కెలు తీర్చేస్వామని భక్తులువచ్చి స్వామిదర్శనం చేసుకొని తీర్ధప్రసాదాలు స్వీకరిస్తున్నారు అని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తపేట శాసనసబ్యులు బండారు సత్యానందరావు భక్తులు లక్షల్లో రావడంతో భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా నిత్తాన్నదానం, నిత్యం ఆఆలయంపై దృష్టి పెట్టి వివిదరకాల అభివృద్ధికి సహకరిస్తున్నారు.పవిత్రపుణ్యక్షేత్రమైన వాడపల్లి ఆలయంపై కొంతమంది నాయకులు రాజకీయాలుచేస్తు నకిలీలు దుష్ప్రాచార వార్తలు సామాజికమాధ్యమాల్లో పెడుతున్న విషయం అందరకీ తెలిసిందే.అయితే కాలం ఎవ్వర్నివదలదు,భగవంతునిపై అవాకులు చవాకులు పేలుతున్నవార్ని శక్తివంతుడైన వెంకన్నవదలడని పాలూరి హెచ్చరించారు. ఇంత విశిష్ట మైన దేవాలయం మన కోనసీమ లో ఉండటం ప్రతీ హిందువు ఆనందించవలసిన విషయం అని సత్యానందం అన్నారు. ఆలయ విశిష్టత, అభివృద్ధి ఓర్వలేక హిందూ వ్యతిరేకులు దృష్ప్రచారం లో ముందు ఉంటున్నారు అని వారికి ఆ అవకాశం ఇవ్వకూడదు అని సత్యానందం అన్నారు.