జిల్లా కమిటీ లో పెగడపల్లి జర్నలిస్టులకు చోటు
జనం న్యూస్ 19జూన్ పెగడపల్లి ప్రతినిధి
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన జర్నలిస్టుల సమావేశంలో జగిత్యాల జిల్లా కమిటీ లో పెగడపల్లి జర్నలిస్టులకు అవకాశం కల్పించారు జిల్లా ఉపాధ్యక్షులుగా కాసం శ్రీనివాస్ రెడ్డి కార్యవర్గ సభ్యులుగా ముల్క రాజేశం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మా ఎన్నికలకు సహకరించిన రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీకి మండల కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు