జనం న్యూస్ జూన్ 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన మను చౌదరిని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మరియు తదితరులు ఆయన కార్యాలయంలో కలిసి అభినందించారు. శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రమేష్ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. వాటి పరిష్కారం కోసం తక్షణమే తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు.