జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు విజయనగరం టీడీపీ కార్యాలయంలో గురువారం సర్వేయర్ల వినతిపత్రం అందజేశారు. సర్వే అధికారి సరెండర్ రద్దు చేసి ఉప సర్వే పరిశీలనకు జారీ చేసిన మెమోలను వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సర్వేయర్లకు సమస్యలుంటే చెప్పాలి తప్ప పెన్ డౌన్ చేయడం సరికాదని సర్వేయర్లను మందలించారు.
ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.