స్థానిక సంస్థల ఎన్నికలపై తొందరపాటు నిర్ణయాలు వద్దు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పొనుగోటి రంగా
జనం న్యూస్ జూన్ 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
బీసీలకు 42 శాతంకు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పొనుగోటి రంగా అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తానంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమ చేపడతాం అన్నారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుందనీ,42 శాతంకు బిసి రిజర్వేషన్ల పెంచే విషయంలో ఇంతవరకు క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. వాస్తవంగా దాదాపు 12 నెలల క్రితం జరగవలసిన ఎన్నికలు బీసీ రిజర్వేషన్ గురించి వాయిదా మీద వాయిదా పడుతూ జాప్యం జరుగుతుందన్నారు.ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు.వాస్తవంగా రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కేంద్రంపై నెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.బీసీ రిజర్వేషన్ ను పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.