(జనం న్యూస్ చంటి జూన్ 19)
దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో రేపు నిర్వహించబోయే ఇందిరమ్మ లబ్ధిదారుల ప్రొజెటింగ్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పడాల రాములు అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడానికి జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రోస్టింగ్ లు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉప మద్దెల స్వామి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారు లాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు బాలశేఖర్ రెడ్డి, గొల్ల మల్లేష్ తదితరులు ఉన్నారు.