జనం న్యూస్ 20 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ప్రపంచ సికిల్ వ్యాధి దినోత్సవము సందర్బముగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో జిల్లా అధికారులు గురువారం మెంటాడ మండల అధికారులు, విద్యాశాఖ అధికారులతో గిరిజన ప్రాంతంలోని ఉయ్యాడ వలస గ్రామములో సికిల్ సెల్ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. జీవన రాణి, పాల్గొని గిరిజన ప్రాంత ప్రజలు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కలిగివుండాలని తెలిపారు.అనంతరం పోస్టర్లు, పుస్తకాలు ప్రారంభించారు, గిరిజన గ్రామాల ప్రజలు ఈ వ్యాది పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి పట్ల అవగాహన. కలిగి వుండాలని ఆమె తెలియజేశారు.అలాగే జిల్లా లెప్రరిసి, ఎయిడ్స్ మరియు క్షయ అధికారి డాక్టర్ కె రాణి మాట్లాడుతూ సికిల్ సెల్ వ్యాధి పట్ల అవగాహనతో ఉండాలని అందరూ పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. ఈ వ్యాధి రాకుండా తీసుకోవలసి జాగ్రత్తలు గూర్చి వ్యాధి వచ్చిన పిదప ఇచ్చే చికిత్స లు గూర్చి మెంటాడ పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ జె లోకప్రియ వివరించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ ఏ భానుమూర్తి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమములో లోతుగెడ్డ గ్రామ సర్పంచ్ సారా భీమారావు ప్రభుత్వ శాఖల సిబ్బంది ,ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సికిల్ సెల్ వ్యాధి పరీక్షలు వైద్య శిబిరంలో నిర్వహించడమైనది. ఆండ్ర గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల పిల్లలు, వైద్య సిబ్బంది, టీచర్లు కలసి గ్రామములో పలు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఇ.ఓ.పి.ఆర్.డి విమల కుమారి సి.హెచ్.ఓ సత్యనారాయణ మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.