జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, ఆర్ అండ్ బి బంగ్లా ఆవరణము నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వర్గీయ చెంగారి సాయి ప్రసన్న 25 జయంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పేదలకు అల్పాహార వితరణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కెనరా బ్యాంక్ మేనేజర్ డి వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదల కడుపు నింపుతూ ఆకలిని తీర్చటం మహా పుణ్యకార్యమని ఇలాంటి కార్యక్రమాలతో సేవ చేయటం ప్రతి ఒక్కరూ అలవర్చు కోవాలని తెలియజేశారు. ఎస్ ఐ మన్నెం రామమోహన్ మాట్లాడుతూ క్లబ్స్ ద్వారా చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు ప్రేరణ సేవాగుణంలో ఉన్న తృప్తికి మించినది లేదని ప్రతి ఒక్కరూ తెలుసుకొని తమ వంతు సాటి మానవులకు సేవ చేయటానికి ప్రయత్నం చేయాలని తద్వారా తమ కుటుంబ సభ్యులకు ఎంతో మేలు జరుగుతుందని విషయాన్నిగుర్తుంచుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చెంగారి రామాంజనేయులు ( కేంద్ర పురావస్తు శాఖ మాజీ ఉద్యోగులు ), లయన్స్ క్లబ్ అధ్యక్షులు కుర్రా మణి యాదవ్ ఎస్ గురు ప్రసాద్, ఉప్పు శెట్టి సుధీర్ కొత్తపల్లి రాజా చారి, రిటైర్డ్ తహసిల్దార్ జయన్న గొబ్బిళ్ళ సుబ్బరామయ్య అడ్వకేట్, ఓబిలి రామ్మోహన్ రెడ్డి, ఆంజనేయులు, కానకుర్తి వెంకటయ్య, పాటూరు రమేష్, మట్టి బాబు తదితరులు పాల్గొన్నారు.