జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ లో మొక్కల పెంపకం మానవ జీవన శైలిలో ఒక భాగం కావాలని మండల ప్రత్యేక అధికారి గుణశేఖర్ పి తాహసిల్దార్ అమరేశ్వరి, ఎంపీడీవో రాధాకృష్ణ సర్పంచ్ జంబు సూర్యనారాయణలు అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలో ర్యాలీ నిర్వహించి పంచాయతీ ఆఫీస్ సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కలు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి కాటన్ సంచులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో భాగస్వాములు అయితేనే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ పి ఆర్ డి సురేష్ బాబు గ్రామపంచాయతీ కార్యదర్శి సురేష్. సచివాలయ కార్యదర్శి వెంకటరమణ. కానకుర్తి వెంకటయ్య మట్టి బాబు నారప శెట్టి శివ గంగాధర్ నరసింహులు ఉపాధి హామీ వెలుగు సిబ్బంది సచివాలయ సిబ్బంది గ్రామపంచాయతీ కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు.