జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు
సూపర్ సిక్స్ లో భాగమైన నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF)గా డిమాండ్ చేస్తున్నామని AIYF ఏరియా కార్యదర్శి మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల సేకరించారు.ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా లక్ష్యలాది మంది నిరుద్యోగులు ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఏ రకంగా ఉందో ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు.మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకి రూ. 3 వేలు చొప్పన నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువతకి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు.నిరుద్యోగ భృతి వస్తే పోటీ పరీక్షలకు శిక్షణ పొందుదామని నిరుద్యోగ భృతి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులను నట్టేట ముంచారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 2025 ఫిబ్రవరి నెలలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ద్వారా నిర్వహించిన 'స్కిల్ సెన్సెక్స్ సర్వే' ప్రకారం 26 జిల్లాల్లో 2.67 కోట్ల మంది దగ్గర వివరాలను సేకరించగా ఉపాధి లేని వారి సంఖ్య కోటిన్నర పైనే ఉందన్నారు. రాష్ట్రంలో 18 నుండి 50సం||ల మద్య వయస్సు వారిలో ఏ ఉపాధి లేనివారు ఒక కోటి 56 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వగణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు.వీరిలో 52.69 లక్షల మంది ఏదో ఒక పని చేస్తున్నట్లు తెలపగా 52.74 లక్షల మంది ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలపడం గమనార్హం గా మారిందన్నారు.నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో నైపుణ్యం కలిగించేలా శిక్షణ ఇచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రకటనలే తప్ప సంవత్సర కాలంలో నిరుద్యోగ యువతకు ఒరిగిందేమి లేదన్నారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో సుమారు 3.20 లక్షల ఖాళీలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్న ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదలచేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు.ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియక కోటి ఆశలతోఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు పోరాడితేనే భవిత అని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి ఏఐవైఎఫ్ పిలుపు నిస్తోందన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో యువతకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.ఈ కార్యక్రమంలో AIYF నాయకులు రవి,వెంకటేష్,లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.