జనం న్యూస్ జూన్ 19:నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం
:జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో భాగంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఎన్ని కల నిర్వాహణ అధికారి భూక్యా లక్ష్మన్ నాయక్ ఏ డి ఇ,తాజా మాజీ బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు భూక్యా చంద్రు నాయక్ ,ఆర్మూర్ డివిజన్ ఎన్నికల పర్యవేక్షకుల బాదావత్ శర్మ నాయక్ ఆధ్వర్యంలోబాల్కోండ నియోజకవర్గంలోని శుక్రవారం మోర్తాడ్ మండల ఎన్ని కలు నిర్వహించారు. మోర్తాడ్ మండల బంజారా సవా సంఘ్ మండల అధ్యక్షుడు గా మాలవత్ సుధీర్ నాయక్ , ప్రధాన కార్యదర్శి గా మాలావత్ వినోద్ నాయక్, ఉపాధ్యక్షులుగా మాలవత్ కిషన్ నాయక్ లను తాండా నాయక్, కార్భారీలు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఏక గ్రీవవముగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. బంజారా బిడ్డలు అందరూ కలిసి ఇలా ఐకమత్యంతో ఉండాలని, జాతి పట్ల అంకితభావంతో నిజాయితీ తోపని చేయాలని, సేవాలాల్ జగదాంబ ఆశీర్వాదం తో ముందుకు సాగాలని అన్నారు.
జాతి ఉన్నతిని కాపాడాలని అన్నారు.నూతనంగా ఎన్నికైన కార్య వర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి నూతన కార్యవర్గ సభ్యులను వారు అభినందించారు.