11 వ అంతర్జాతీయ యోగ కార్యక్రమము
( జనంన్యూస్ 21 జూన్ కాసిపేటరవి )
భీమారం మండలo నర్సింగాపూర్ గ్రామ ఉపాధి హామీ కూలీల కూలి ప్రదేశం నందు శనివారం రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం , మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి భాగమై పోయిందని, యోగాసనాల ప్రాధాన్యతని బట్టి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయినా తరువాత ఐక్య రాజ్య సమితి మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న ప్రకటించారని అన్నారు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవంగా దాదాపు 186 దేశాలు అధికారికంగా నిర్వహిస్తున్నారు .ఇప్పుడు యోగ అంతర్ జాతీయం,అదేవిదంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగ దినోత్సవం 2025 లో మోడీ నేతృత్వంలో కొనసాగుతుందని శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు యొక్క సమగ్ర విధానాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం చక్కటి వేదికగా పని చేస్తుందని యోగ ద్వారా ప్రపంచానికి మన భారతీయ సంస్కృతి గొప్పతనం తెలుస్తుందని యోగ అనేది వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉపయోగ పడుతుందని, దీని ద్వారా ఆరోగ్యం తో పాటు మానసిక స్థితి,భౌతికంగానే కాకుండా మానసికమైన వివత్వం లభిస్తుందని 21న యోగ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నర్సింగపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి కాంతి తేజ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కే సుధాకర్ యోగ ఆసనాలను సూచించారు,ఈ కార్యక్రమం ఉపాధి హామీ శ్రమ కూలీలు పాల్గొన్నారు.