జనం న్యూస్ జూన్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. భూపాల పల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం మండలంలోని మైలారం,హుస్సేన్ పల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లు నిర్మిస్తామని పేదోడిని మోసం చేసిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్లీ పేదవారికోసం ఇళ్లు నిర్మిస్తున్నామని అన్నారు. అలాగే లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుకను సంబధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి వద్ద ఇసుక టోకెన్లు తీసుకుని వినియోగించుకోవాలని సూచించారు. విడతల వారిగా అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మసికే కుమార్, లడే రాజ్ కుమార్, గుండేకారి రాజేందర్, రాజు, లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు…