జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జిల్లా యోగ కన్వీనర్ బాబీ మాస్టారు
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు కే జగన్నాధపురం జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో గ్రామ సర్పంచ్ మేడి శెట్టి ఉషారాణి శ్రీనివాస్ హెచ్ఎం జి సూర్య కుమార్ గారి మరియు గ్రామ సెక్రెటరీ కె వెంకన్న గారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా యోగా కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా యోగా కన్వీనర్ గని శెట్టి వెంకటేశ్వరరావు మండల యోగ కన్వీనర్ వేటుకూరి శ్రీనివాస్ రాజు మరియు బుట్టే భాస్కర్ విద్యార్థుల చేత ఉపాధ్యాయ బృందం పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు ఉపాధి శ్రామికులు డ్వాక్రా గ్రూప్ మహిళలు అందరు చేత యోగాసనములు సూర్య నమస్కారాలు చేయించడం జరిగినది ఈ ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం జి సురుకుమాల గారు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించేందుకు మనమందరము అమ్మకోసం అనే పేరుతో ఒక మొక్క నాటుదాం మన ఆరోగ్యం రక్షణ కోసం మనమందరం ప్రతిరోజు ఉదయం 20 నిమిషాలు యోగాసేద్దాం అని అన్నారు తదనంతరం ఫీల్డ్ అసిస్టెంట్ మట్టపర్తి రమణ మరియు ఉపాధి శ్రామికులు ఆధ్వర్యంలో యోగా ర్యాలీ మరియు అమృత సరోవర్ లో భాగంగా పంచాయతీ చెరువు వద్ద ఉపాధి శ్రామికుల చేత యోగా చేయించడం జరిగినది ఈ కార్యక్రమంలో నల్ల శ్రీను మల్లాది మల్లిబాబు మాస్టారు యనమదల వెంకటరమణ కారుబత్తి సత్తిబాబు గుత్తుల పెద్ద ఉపాధ్యాయులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు