జనం న్యూస్- జూన్ 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ హిల్ కాలనీ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సీఎంవో డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, అయ్యాకుల రాజు డాక్టర్లతో మరియు సిబ్బందితో ధ్యానం మరియు యోగాసనాలు ప్రాణయామ చేయించారు, ఈ సందర్భంగా డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ నేటి మనిషి బిజీ జీవితంలో మానసిక ప్రశాంతత పెంచేందుకు యోగ ఎంతగానో దోహదపడుతుందని యోగాసనాలు, ధ్యానం తో శరీరం ఒత్తిడిని తట్టుకొని రక్తపోటుని నివారించుకోవచ్చు అని అన్నారు. మారిన జీవన ఆలవాట్లు, ఆహారంతో వస్తున్న అనేక మానసిక శారీరక అనారోగ్యాలు అన్నింటికీ యోగ ఒక చక్కటి పరిష్కారమని తెలిపారు, రోజు క్రమం తప్పకుండా యోగా చేయటం వల్ల శారీరకంగా మానసికంగా మార్పులు రావడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలాని నెహ్రూ ఏరియా ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ చక్రవర్తి ,డాక్టర్ అనిత రాణి, డాక్టర్ తరీష్ బాబు, నర్సింగ్ సిబ్బంది మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.