జనం న్యూస్ - జూన్ 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
ఆర్య వైశ్యులు ఐక్యంగా ఉండి రాజకీయాలలో ఎదగాల్సిన అవసరం ఉందని నల్గొండ జిల్లా ఆర్య, వైశ్యుల సంఘం అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. నలగొండ జిల్లా ఆర్యవైశ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న సందర్భముగా మొదటిసారిగా నాగార్జునసాగర్ లోని విజయ విహార్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ శ్రీనివాస్ తో కలిసి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ పరిమాణాలను దృష్టిలో పెట్టుకొని ఆర్య వైశ్యులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ సందర్భంగా పెదవుర మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాస్ నూతనంగా ఎన్నుకోబడిన ఆర్యవైశ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులను మెమెంటో, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్య అధ్యక్షులు సాంబశివరావు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.