జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక పోలిరెడ్డిపాలెంలోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది.. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ ఉదయం 6 గంటలకు హాజరై ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె హైమావతి మాట్లాడుతూ… యోగ మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, అంతర్జాతీయ స్థాయిలో యోగా యొక్క ప్రాముఖ్యతను నలు దిశల వ్యాపించేటట్లు రాష్ట్ర ప్రభుత్వ కృషి అభినందనీయం మరియు ఆచరణీయమని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు శారీరక ఆరోగ్యంగా పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని అన్నారు, ఉరుకుల ,పరుగుల జీవితంలో నేడు మానవుడు ఎదుర్కొంటున్న మానసిక మరియు శారీరక అనారోగ్యాలు అన్నింటికీ యోగా ఓ మంత్రం లాంటిదని, ఎలాంటి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకునే మెళకువలు యోగ నేర్పిస్తుందని, ప్రతి ఒక్కరి దైనందన జీవితంలో యోగా అంతర్భాగమైతే జీవితాలు ఆనందమయం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ వెంకటరామయ్య,స్కూల్ మేనేజ్మెంట్ చైర్ పర్సన్,సభ్యులు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పి శైలజ,పోటు శ్రీనివాసరావు కె అరుణ జి ఆదిలక్ష్మి నవ్యశ్రీ మరియు రజక కాలనీ 34వ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంరాష్ట్ర జిల్లా విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు పాఠశాల ఉదయం 6 గంటల నుండి ప్రారంభమై 8 గంటల వరకు యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు భాగంగా ప్రతి నెల మూడో శనివారం చేపట్టే కార్యక్రమాలను విద్యార్థిని విద్యార్థులు చేయించడం జరిగింది